Rat: ఎలుక కొరకడంతో శిశువు మృతి

నలభై రోజుల వయస్సు శిశువును ఎలుక కొరకడంతో మృతి చెందాడు.

Published : 25 Dec 2023 07:41 IST

కందనూలు, న్యూస్‌టుడే: నలభై రోజుల వయస్సు శిశువును ఎలుక కొరకడంతో మృతి చెందిన ఘటన ఇది. నాగర్‌కర్నూల్‌ పట్టణం నాగనూల్‌లోని శివ, లక్ష్మికళ దంపతులకు 40 రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. శనివారం రాత్రి నేలపై తల్లితో నిద్రిస్తున్న చిన్నారి ముక్కును ఎలుక కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. శిశువు ఏడుపుతో అప్రమత్తమై వెంటనే పట్టణ ఆసుపత్రికి తరలించారు. తరువాత నగరంలోని నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మధ్యాహ్నం చిన్నారి మృతి చెందాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని