IIT Delhi: దిల్లీ ఐఐటీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య!

ఐఐటీ దిల్లీ (IIT Delhi)లో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఉత్తర్‌ ప్రదేశ్‌ (Uttar Pradesh)కు చెందిన విద్యార్థి హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

Published : 09 Jul 2023 16:17 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీ (IIT)ల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలు కలకలం రేకెత్తిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐఐటీ మద్రాస్‌ (IIT Madras)లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా ఐఐటీ దిల్లీ (IIT Delhi)లో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బరేలీ (Bareilly)కి చెందిన ఆయుష్‌ అనే విద్యార్థి ఐఐటీ దిల్లీలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి  ఆ విద్యార్థి క్యాంపస్‌లోని ఉదయగిరి హాస్టల్‌లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

ఈ ఏడాదిలో దేశంలోని ఐఐటీల్లో ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఫిబ్రవరి నెలలో ఐఐటీ మద్రాస్‌లో ఒకరు, ఐఐటీ బాంబేలో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మార్చి నెలలో ఐఐటీ మద్రాస్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి, ఏప్రిల్‌ నెలలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా దిల్లీ ఐఐటీలో బీటెక్‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని