Dastagiri: నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత: దస్తగిరి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షి అయిన అప్రూవర్ డ్రైవర్ దస్తగిరి తన భద్రత విషయంలో మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు.
పులివెందుల: బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి, అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి తనకు ప్రాణభయం ఉందంటూ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనకు ముప్పు తలపెట్టేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత. ప్రభుత్వ అధికారులంతా సీఎం చెప్పినట్లే వింటారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్ అందరూ ఒకే కుటుంబం. నన్ను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. వివేకా హత్య కేసు ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారు. పెద్దవాళ్లనే కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నారు.. వారికి నేను లెక్క కాదు. నాకు ప్రాణ భయం ఉంది.. రక్షణ కల్పించాలి. గన్‌మెన్లను ఎందుకు మార్చారని ఎస్పీకి ఫిర్యాదు చేశా. నా వ్యాఖ్యలు అసత్యాలని ఎస్పీ చెప్పడం బాధాకరం. సమస్య నాది.. ఏం కుట్ర జరుగుతుందో నాకు తెలుసు’’ అని దస్తగిరి వాపోయారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!