Bapatla: పండగ వేళ బాపట్ల, విశాఖలో అగ్ని ప్రమాదం

దీపావళి పండగ వేళ బాపట్లలో రెండు చోట్ల అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టపాసుల నిప్పురవ్వలు పడి ఎస్‌.ఎన్‌.పి అగ్రహారం, గులాం హుస్సేన్‌ తోటలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి.

Published : 13 Nov 2023 02:02 IST

బాపట్ల: దీపావళి పండగ వేళ బాపట్లలో రెండు చోట్ల అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టపాసుల నిప్పురవ్వలు పడి ఎస్‌.ఎన్‌.పి అగ్రహారం, గులాం హుస్సేన్‌ తోటలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఎస్‌.ఎన్‌.పీ అగ్రహారంలో ఎమ్మెల్యే ఫ్లెక్సీ అడ్డుగా ఉండటంతో ఫైర్‌ ఇంజిన్‌ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అడ్డుగా ఉన్న ఫ్లెక్సీ తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నించగా.. ఫ్లెక్సీకి కరెంటు షాక్‌ రావడంతో తొలగించడంలో ఆలస్యమైంది. ఫైర్‌ ఇంజిన్‌ రాకపోవడంతో స్థానికులు నీళ్లు చల్లి మంటలార్పారు. కట్టుబట్టలతో మిగిలామని బాధితులు వాపోతున్నారు. 

మరోవైపు, విశాఖ అక్కయ్యపాలెంలో అపార్ట్‌మెంట్‌లోకి తారాజువ్వలు దూసుకెళ్లాయి. మంటల చెలరేగడంతో భయంతో స్థానికులు పరుగులు తీశారు. ఘటనాస్థలానికి చేరుకొని అగ్నిమాసక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని