నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్‌ విద్యార్థులు మృతి

కావేరి నదిలో ఈతకు దిగిన విద్యార్థులు ఐదుగురు మృత్యువాతపడిన ఘటన కర్ణాటకలో విషాదం రేపింది.

Updated : 29 Apr 2024 22:41 IST

రామనగర: కర్ణాటకలో పెను విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు కావేరి నదిలో దిగిన ఐదుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు విగతజీవులుగా మారారు. రామనగర జిల్లా కనకపురలో మేకెదాటు వద్ద కావేరీ నది సంగమంలో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు కాగా.. ఇద్దరు అబ్బాయిలు ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరు నుంచి 12మంది కాలేజీ విద్యార్థులు కలిసి ఇక్కడికి వచ్చారని.. వీరిలో ఐదుగురు ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు సతనూరు పోలీసులు తెలిపారు. మృతులను హర్షిత (20), అభిషేక్‌ (20), తేజస్‌ (21), వర్ష (20), నేహా (19)గా గుర్తించామన్నారు. తొలుత ఒక విద్యార్థి ఈత కొట్టేందుకు నదిలోకి దిగి కొట్టుకుపోగా.. అతడిని కాపాడేందుకు దిగిన విద్యార్థులు.. ఒకరితర్వాత ఒకరు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని