353 కిలోల గంజాయి పట్టివేత.. నిందితుల్లో గ్రామ వాలంటీరు

అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని, అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు.

Updated : 23 Sep 2023 05:54 IST

అయిదుగురు అరెస్టు

సీలేరు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని, అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో గ్రామ వాలంటీరు ఉన్నారు. చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జీకేవీధి సీఐ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో సీలేరు ఎస్సై రామకృష్ణ, సిబ్బంది స్థానిక టీఆర్‌సీ క్యాంపు వద్ద గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో తరలిస్తున్న 353 కిలోల గంజాయి పట్టుబడింది. దాని విలువ రూ.కోటి ఉంటుందని అంచనా. దీనికి సంబంధించి సీలేరు పంచాయతీలో వాలంటీరుగా పనిచేస్తున్న కొర్రా జగ్గారావు, సీసా లైకోన్‌, కిల్లో రాజు, వంతల త్రినాథ్‌, వెంకటేష్‌లను అరెస్టు చేశారు. వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి, మహారాష్ట్రకు చెందిన సికిందర్‌ అలియాస్‌ సూరజ్‌కు భద్రాచలంలో విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి మూడు ఫోన్లు, రూ.3 వేల నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నామని అదనపు ఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని