వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి

వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది.

Published : 19 Apr 2024 04:03 IST

ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ

గంగవరం, న్యూస్‌టుడే: వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. అటవీ అధికారుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కొందరు వేటగాళ్లు అటవీ జంతువులే లక్ష్యంగా గ్రామానికి చెందిన లక్ష్మయ్య పొలంలో విద్యుత్‌ ఉచ్చులు ఏర్పాటుచేశారు. కౌండిన్య అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో బుధవారం రాత్రి ఏనుగుల మంద గ్రామ సమీపానికి వచ్చాయి. వాటిలో ఓ ఏనుగు మెడకు విద్యుత్‌ ఉచ్చు తగలడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే కుప్పకూలింది. కొందరు గమనించి విషయాన్ని గంగవరం సీఐ చినగోవిందు, అటవీ అధికారులకు తెలిపారు. గ్రామానికి చెందిన అయిదుగురిని అనుమానితులుగా అధికారులు తేల్చారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని