12 మంది కల్తీ విత్తన విక్రేతలపై క్రిమినల్‌ కేసులు

రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన 12మందిని గుర్తించి క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది.

Published : 29 Apr 2024 04:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన 12మందిని గుర్తించి క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. లైసెన్స్‌ గల డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని.. తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని పంట కోతలు పూర్తయ్యే వరకు దానిని భద్రపరుచుకోవాలని పేర్కొంది. ‘‘వానాకాలం సీజన్‌లో రైతులు కల్తీ విత్తనాలు కొని మోసపోవద్దు. నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కల్తీ విత్తనాలను నిరోధించేందుకు ఇప్పటికే వ్యవసాయ, పోలీసు, విజిలెన్స్‌ శాఖలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సరిహద్దు రాష్ట్రాలను ఆనుకొని ఉన్న జిల్లాల్లో ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది.  లైసెన్స్‌ లేకుండా రైతులను మభ్యపెట్టి నిషేధిత పత్తి, ఇతర విత్తనాలను విక్రయించే వారిపై గట్టి నిఘా పెట్టాం. విత్తన నియంత్రణ చట్టం-1983 ప్రకారం లైసెన్స్‌లు లేకుండా విత్తనాలను విక్రయించడం నేరం’’ అని వ్యవసాయ శాఖ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని