పాక్‌ పడవ నుంచి రూ.600 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం

గుజరాత్‌ తీరానికి సమీపంలో పాకిస్థాన్‌కు చెందిన పడవ నుంచి 86 కేజీల బరువున్న 78 పొట్లాల మాదకద్రవ్యాలను భారతీయ కోస్టుగార్డు స్వాధీనం చేసుకున్నట్లు తీర రక్షక దళ సంస్థ ఆదివారం తెలిపింది.

Published : 29 Apr 2024 04:46 IST

గుజరాత్‌ తీరానికి సమీపంలో 14 మంది అరెస్టు

అహ్మదాబాద్‌: గుజరాత్‌ తీరానికి సమీపంలో పాకిస్థాన్‌కు చెందిన పడవ నుంచి 86 కేజీల బరువున్న 78 పొట్లాల మాదకద్రవ్యాలను భారతీయ కోస్టుగార్డు స్వాధీనం చేసుకున్నట్లు తీర రక్షక దళ సంస్థ ఆదివారం తెలిపింది. ఈ పొట్లాల్లో హెరాయిన్‌, ఒపియడ్స్‌ ఉన్నాయని, ఈ సరకు విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని పేర్కొంది. పడవలో ఉన్న 14 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది. గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌), మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ)ల సమన్వయంతో శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని