Youtube: యూట్యూబ్‌లో చేతబడి వీడియోలు చూసి నరబలి

హరియాణా పానీపత్‌లో ఏడేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

Updated : 31 Oct 2022 06:48 IST

హరియాణా పానీపత్‌లో ఏడేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడు యోగేశ్‌.. ఓ బాలికను నరబలి ఇచ్చిన విషయంపై కీలక వివరాలు రాబట్టారు పోలీసులు. అమ్మాయిలను లొంగదీసుకోవడానికి నిందితుడు యోగేశ్‌ చేతబడి నేర్చుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసేవాడని.. చేతబడిలో ప్రావీణ్యం సంపాదించడానికి బాలికను చంపాలని ప్రణాళిక రచించాడని పేర్కొన్నారు. అందుకే ఏడేళ్ల చిన్నారిని టార్గెట్‌ చేసిన యోగేశ్‌.. దీపావళి రోజున ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని హత్యాచారం చేసి కవర్‌లో చుట్టి ఆమె ఇంటి పెరట్లో పడేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని