అప్పులు తీర్చలేక తండ్రి బలవన్మరణం.. తట్టుకోలేక కుమారుడూ ఆత్మహత్యాయత్నం

Eenadu icon
By Crime News Desk Updated : 29 Oct 2025 06:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నర్సాపూర్, న్యూస్‌టుడే: అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన తండ్రి క్రిమిసంహారక మందు తాగాడు. ఇంటికి వచ్చి విషయం చెప్పడంతో నువ్వు లేకుంటే నేను ఉండలేనంటూ కుమారుడు అదే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందగా..కుమారుడు చికిత్స పొందుతున్నాడు. ఎస్సై రంజిత్‌రెడ్డి కథనం మేరకు..మెదక్‌ జిల్లా నర్సాపూర్‌కు చెందిన సయ్యద్‌ ఆరీఫ్‌(48) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు. మూడు నెలల క్రితం బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరగడంతో కుడి కాలికి గాయాలయ్యాయి. అప్పట్నుంచి ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తాను చేసిన అప్పులను తలుచుకుని మనోవేదనకు గురైన ఆరీఫ్‌ ఆదివారం బయటకు వెళ్లి  క్రిమిసంహారక మందు తాగి ఆ డబ్బాతో ఇంటికొచ్చాడు. జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పగా..చిన్న కుమారుడు సోయాన్‌ ఆవేశంగా ‘మీరు లేకుండా నేనూ బతకలేను’ అంటూ తండ్రి చేతిలో క్రిమిసంహారక మందు లాక్కుని తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే వారిని హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆరీఫ్‌ మంగళవారం ఉదయం మృతి చెందాడు. సోయాన్‌ చికిత్స పొందుతున్నాడు.

Tags :
Published : 29 Oct 2025 05:25 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని