Crime News: చంపేసి, నదిలో విసిరేసి: భాజపా మహిళా నేత మిస్సింగ్ కేసులో భర్త అరెస్టు

Crime News: పదిరోజుల క్రితం మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ వెళ్లిన భాజపా మహిళా నేత అదృశ్యమయ్యారు. ఆమె మిస్సింగ్ వెనక గల కారణాలను పోలీసులు గుర్తించారు.  

Published : 12 Aug 2023 12:26 IST

ముంబయి: పది రోజులుగా కనిపించకుండాపోయిన నాగ్‌పుర్‌కు చెందిన భాజపా నేత( Nagpur BJP leader) సనాఖాన్(Sana Khan) కేసులో పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేశారు. సనాను ఆమె భర్తే హత్య చేశాడని వెల్లడించారు.

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన సనాఖాన్‌.. భాజపా మైనార్టీ సెల్‌ సభ్యురాలు. ఆమె ఆగస్టు ఒకటిన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌(Jabalpur)కు వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించలేదు. తన భర్తను కలిసేందుకు ఆమె అక్కడికి వెళ్లిందని కుటుంబసభ్యులు తెలిపారు. జబల్‌పుర్‌కు చేరుకున్న తర్వాత సనా తన తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. భర్త అమిత్‌ సాహును కలిసి రెండు రోజుల్లో తిరిగిరావాల్సి ఉందని వారు తెలిపారు. కానీ ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్ అని రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆస్పత్రికని వెళ్లి.. ఆ తర్వాత కాలి బూడిదై: శంషాబాద్‌ మహిళ హత్య కేసులో పురోగతి!

అమిత్‌ సాహు మద్యం అక్రమరవాణా వ్యాపారం చేస్తుంటాడని, ఓ దాబా నిర్వహిస్తున్నాడని సమాచారం. ఆర్థిక లావాదేవీల విషయంలో సనా, అమిత్‌ మధ్య కొద్దికాలంగా గొడవలు ఉన్నాయి. ఆమె జబల్‌పుర్ వచ్చిన సమయంలో కూడా అదే విషయమై వారిద్దరు గొడవపడ్డారని, అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయడంతో అమిత్‌ దాడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తన ఇంట్లోనే ఆమెను కొట్టడంతో మరణించిందని, తర్వాత ఆమెను హిరాన్ నదిలో విసిరేశానని విచారణలో అమిత్ అంగీకరించాడు. ఆమె మృతదేహం కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. అలాగే ఈ కేసులో అమిత్‌తో పాటు మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని