Bapatla: ఇసుక వివాదం.. వైకాపా నాయకురాలి అనుచరులను చితకబాదిన జేపీ సంస్థ సిబ్బంది

బాపట్ల జిల్లా అద్దంకి మండలం చిలకలేరు ఇసుక రీచ్‌లో వైకాపా నాయకురాలు శారద అనుచరులను జేపీ సంస్థకు చెందిన ప్రతినిధులు చితకబాదారు.

Published : 21 Oct 2023 15:48 IST

అద్దంకి: బాపట్ల జిల్లా అద్దంకి మండలం చిలకలేరు ఇసుక రీచ్‌లో వైకాపా నాయకురాలు శారద అనుచరులను జేపీ సంస్థకు చెందిన ప్రతినిధులు చితకబాదారు. ఇసుక తవ్వకాలపై జేపీ సంస్థ, శారదకు మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శారద అనుచరులను మోకాళ్లపై కూర్చోబెట్టి కర్రలతో దాడి చేశారు. దాడికి సంబంధించిన వీడియోలతో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వైకాపా నేత శారద వాపోయారు. తమ అనుచరులు ఇంకా జేపీ సంస్థ నిర్బంధంలోనే ఉన్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని