కేసీఆర్‌ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు అరెస్టు

భూవివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. కన్నారావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమారుడు.

Updated : 02 Apr 2024 18:13 IST

హైదరాబాద్‌ : భూవివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. కన్నారావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమారుడు. మన్నెగూడ భూవివాదం కేసులో ఏ1గా ఉన్నాడు. మంగళవారం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదంలో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కె.కన్నారావు, మరో 35 మందిపై ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల కేసు నమోదైంది. మన్నెగూడలో 2 ఎకరాల కబ్జాకు యత్నించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతడి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు హైకోర్టు నిన్న తిరస్కరించింది. ఇబ్రహీంపట్నం కోర్టు కన్నారావుకు 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించినట్టు ఆదిభట్ల పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని