కోడికత్తి కేసు.. బెయిల్‌కు సుప్రీంకోర్టుకు వెళ్లండి: నిందితుడికి ఎన్‌ఐఏ కోర్టు సూచన

కోడికత్తి కేసుపై విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ కోర్టును అభ్యర్థించాడు.

Updated : 04 Jul 2023 13:44 IST

విజయవాడ: కోడికత్తి కేసుపై విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ కోర్టును అభ్యర్థించాడు. బెయిల్‌ అంశం తమ పరిధిలో లేదని ఎన్‌ఐఏ కోర్టు అతడికి స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది.

గతంలో శ్రీనివాస్‌కు ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం జగన్‌ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది.  అనంతరం తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. 

జైల్లో దీక్ష చేస్తా: నిందితుడు శ్రీనివాస్‌

మరోవైపు కేసు జాప్యాన్ని నిరసిస్తూ జైల్లోనే దీక్ష చేపడతానని నిందితుడు శ్రీనివాసరావు చెప్పాడు. ఈనెల 11 నుంచి దీక్ష చేస్తానని తెలిపాడు. 2018లో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కోడి కత్తితో శ్రీనివాస్‌ దాడి చేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని