Krushi bank: కృషి బ్యాంకు డైరెక్టర్‌ శ్రీధర్‌ అరెస్టు

కృషి కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

Updated : 25 Sep 2023 18:11 IST

పాలకొల్లు: కృషి కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కృషి బ్యాంకు ఛైర్మన్‌, డైరెక్టర్లు 2001లో రూ.36.37 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిపై 2001 ఆగస్టు 11న మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అదే నెలలో ఈ కేసు సీఐడీకి బదిలీ అయ్యింది. దీనిపై నాంపల్లి కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు