logo

నేర ప్రవృత్తి మార్చుకోవాలి : ఎస్పీ

జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.సురేష్‌కుమార్‌ తెలిపారు.

Published : 28 Apr 2024 03:26 IST

బస్సులో తనిఖీ చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది

ఆసిఫాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.సురేష్‌కుమార్‌ తెలిపారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాలు, దుకాణాలు, అనుమానిత ప్రాంతాలు, వాహనాల్లో ప్రత్యేక బృందాలతో సోదాలు చేసినట్లు వివరించారు. ఈ సోదాల్లో జిల్లాలో 7 కేసుల్లో 11 మంది నిందితులను అరెస్టు చేశామని, ఆరు కేసుల్లో రూ.77,050 విలువైన 3.112 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో పాత నేరస్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. నిషేధిత మత్తుపదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. డీఎస్పీ సదయ్య, ఎస్బీ సీఐ రాణా ప్రతాప్‌, ఆసిఫాబాద్‌ టౌన్‌ సీఐ సతీష్‌, ఎస్‌ఐ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని