icon icon icon
icon icon icon

Pawan: 32వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే జగన్ ఒక్క మాట మాట్లాడలేదు: పవన్‌

దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకునే వ్యక్తి మనకు సీఎం ఉన్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఎద్దేవా చేశారు.

Updated : 11 May 2024 19:14 IST

కాకినాడ: దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకునే వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 32వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే జగన్ ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు కాకినాడలో నిర్వహించిన సభలో పవన్‌ ప్రసంగించారు. ‘‘కాకినాడకు రక్షణ కల్పించే మడ అడవులను ధ్వంసం చేస్తున్నారు. గంజాయి, మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతోంది. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చా. నాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. సమాజంలో మార్పు రావాలనే రాజకీయాల్లోకి వచ్చా. పార్టీలు మారే వ్యక్తులు కాదు.. స్థిరంగా ఉండే వారు మనకు కావాలి. వైకాపాకు ఓటేస్తే చేజేతులా గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టే. సమాజాన్ని కాపాడాలి.. ధర్మాన్ని నిలబెట్టాలి.. అదే నా విధానం.

కాకినాడలో లా అండ్ ఆర్డర్‌ మెరుగుపడాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. వైకాపా ప్రభుత్వాన్ని మట్టిలో తొక్కకపోతే భవిష్యత్‌ లేదు. కూటమి ప్రభుత్వం రాగానే కాకినాడలో పాత విధానాలు అమలు చేస్తాం. శాంతిభద్రతలు పరిరక్షిస్తాం. పొత్తు కోసం ప్రధానిని ఒప్పించానంటే ఎంత కష్టపడి ఉంటానో ఆలోచించండి. వైకాపాది గూండాలు, అరాచక ప్రభుత్వం. మీ కోసం ఆలోచించండి. ద్వారంపూడి సంగతి నేను చూస్తా. మత్స్యకార సమాజాన్ని ద్వారంపూడి ఎలా అవహేళన చేశారో మీరు చూశారు. కూటమిదే అఖండ విజయం’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img