logo

సంచార ముస్లిం తెగలను ప్రభుత్వం గుర్తించట్లేదు

రాష్ట్రంలో సంచార ముస్లిం తెగలను ప్రభుత్వాలు గుర్తించకపోవడంతో అన్ని రంగాలు వెనుకబడి ఉన్నారని తెలంగాణ సంచారం ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సైదాఖాన్ అన్నారు.

Updated : 28 Apr 2024 17:04 IST

ఎదులాపురం: రాష్ట్రంలో సంచార ముస్లిం తెగలను ప్రభుత్వాలు గుర్తించకపోవడంతో అన్ని రంగాలు వెనుకబడి ఉన్నారని తెలంగాణ సంచారం ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సైదాఖాన్ అన్నారు. ఆదివారం స్థానిక కేఆర్‌కే కాలనీలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచార ముస్లిం తెగలవారు సామాజికంగా, రాజకీయంగా ఎదగాలంటే ప్రధానంగా ఐక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు.  ప్రధానంగా పహిల్వాన్లు, ఫకీర్లు అచ్చుసాయిబులు ఎక్కువగా వెనుకబడి ఉన్నారన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే ప్రధానంగా విద్యాభివృద్ధి అవసరం అని, ఇందుకుగాను పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించాలన్నారు. ప్రభుత్వాలు సంచార జాతుల ముస్లింలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ బదేసాబ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ అబ్బాస్ అలీ, ఉపాధ్యక్షులుగా సయ్యద్ హుస్సేన్, షేక్ షాదుల్లా, ప్రధాన కార్యదర్శిగా షేక్ అక్రమ్, కోశాధికారిగా షేక్ అంజాద్ ఖాన్ తదితరులను ఎన్నుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని