logo

16 శాతం రాకుంటే డిపాజిట్‌ గల్లంతే..

ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటాం.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

Updated : 29 Apr 2024 06:00 IST

చెన్నూరు పట్టణం, బెల్లంపల్లి పట్టణం న్యూస్‌టుడే

న్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటాం.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఫలితాల తర్వాత తమ డిపాజిట్‌ రుసుము తిరిగి పొందాలంటే పోలైన ఓట్లలో ఆరోవంతు(16 శాతం) ఓట్లు పొందాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఓ నియోజకవర్గంలో 1లక్ష ఓట్లు పోలైతే అందులో 16వేల ఓట్లు సాధించి ఉండాలి. లేదా నిర్దేశిత సమయం కంటే ముందే నామపత్రాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ డిపాజిట్‌ తిరిగి ఇచ్చేస్తారు. లేని పక్షంలో డిపాజిట్‌ రుసుము ఎన్నికల సంఘానికే చెందుతుంది.

71 వేల మంది..

  • ఎన్నికల సంఘం వద్ద ఉన్న సమాచారం ప్రకారం దేశంలో 1951 నుంచి 2019 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 91,160మందిలో 71,245(78 శాతం)మంది డిపాజిట్లను కోల్పోయారు.
  • 1996 అత్యధికంగా 13,652 మంది అభ్యర్థుల్లో 12,688(91 శాతం) మందికి డిపాజిట్లు దక్కలేదు.
  • 1957లో జరిగిన ఎన్నిల్లో అత్యల్పంగా 130 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి.
  • 2019లో 610 మంది డిపాజిట్లు కోల్పోగా.. 3443 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 3,431 మంది ఆరోవంతు ఓట్లు కూడా రాకపోవడంతో కట్టిన నగదును పోగొట్టుకున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని