logo

నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ

లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్‌ పార్లమెంటు

Published : 30 Apr 2024 02:47 IST

సూచనలిస్తున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు వివేకానంద్‌ రాజేంద్ర జదావర్‌, చిత్రంలో కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, ఎస్పీ సురేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు వివేకానంద్‌ రాజేంద్ర జదావర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థాన ఎన్నికల పోలీసు పరిశీలకులు రాజేశ్‌కుమార్‌ సక్సేనా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, ఎస్పీ సురేష్‌కుమార్‌లతో కలిసి నోడల్‌ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈవీఎంల ర్యాండమైజేషన్‌, పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, పోలింగ్‌ రోజు అవసరమైన ఎన్నికల సామగ్రి, ఇతర అంశాలపై జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అభ్యర్థుల ప్రచార కార్యక్రమాల్లో పొరపాట్లకు తావులేకుండా పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల్ని ప్రభావితం చేసే నగదు, మద్యం, బంగారం, కానుకలు తరలింపు నియంత్రణలో అధికారులు పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద బందోబస్తును ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేయాలన్నారు. బ్యాంకుల్లో పెద్దమొత్తంలో జరిగే లావాదేవీల విషయంలో బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు పై అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీసు శాఖకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ఎన్నికల సంబంధిత అంశాల కోసం ఎన్నికల పోలీసు పరిశీలకులను ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పెన్‌గంగ అతిథి గృహంలో ఉదయం 9 నుంచి 10గంటల వరకు అందుబాటులో ఉంటారని, చరవాణి నం.81438 76383 సంప్రదించవచ్చని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని