logo

అంతెత్తు ఇసుక గుట్టలు!

వర్షాలు పడితే గోదావరి నది నుంచి ఇసుక బయటకు తీయడం కష్టం. ఈ నేపథ్యంలో ఎటపాక మండలం గుండాలలో భారీ యంత్రాలతో గోదావరి నుంచి ఇసుక తవ్వి దానిని తీరంలో భారీ నిల్వ చేస్తున్నారు.

Published : 07 Jun 2023 02:12 IST

గుండాలలో ఇసుక రాశులు

ఎటపాక, న్యూస్‌టుడే: వర్షాలు పడితే గోదావరి నది నుంచి ఇసుక బయటకు తీయడం కష్టం. ఈ నేపథ్యంలో ఎటపాక మండలం గుండాలలో భారీ యంత్రాలతో గోదావరి నుంచి ఇసుక తవ్వి దానిని తీరంలో భారీ నిల్వ చేస్తున్నారు. ఇక్కడి నుంచి తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు సాగించి భారీగా నిల్వ చేయడంతో జాతీయ రహదారి పక్కనున్న నిల్వలు చిన్నసైజు గుట్టలు తలపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఇసుక ర్యాంపు నిర్వహణకు ముందస్తుగా గ్రామ సభలు నిర్వహించి తీర్మానం చేయాలి. పీసా చట్టం ప్రకారం స్థానిక ఆదివాసులకు ఇందులో ఉపాధి అవకాశం కల్పించాల్సి ఉంది. కానీ ఇక్కడ అవేవీ అమలుకావడం లేదని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాకా అర్జున్‌ దొర ఆరోపించారు. కాగా ఈ నిల్వలు ప్రమాదకరంగా ఉన్నాయని పరిసరాల్లో ఉన్న వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక జారితే ప్రమాదాలకు ఆస్కారం ఉందని చెబుతున్నారు.

జాతీయ రహదారి పక్కనే భారీగా నిల్వలు


* మన్యంలో ఒక్క గుండాలలో మాత్రమే ఇసుక ర్యాంపునకు అనుమతి ఇచ్చాం. నిబంధనలకు వ్యతిరేకంగా తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. ప్రమాదకరంగా నిల్వలు చేస్తే మరో ప్రాంతానికి మార్పుచేసే అవకాశాన్ని పరిశీలిస్తాం.

సుమిత్‌ కుమార్‌, కలెక్టర్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని