logo

గిరిజన గ్రామాల్లో కూటమి విస్తృత ప్రచారం

డుంబ్రిగుడ మండలంలో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శనివారం కూటమి నాయకులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు.

Published : 28 Apr 2024 01:43 IST

తూటంగిలో ఇంటింటికి కరపత్రాలతో

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: డుంబ్రిగుడ మండలంలో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శనివారం కూటమి నాయకులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. తెదేపా మండల అధ్యక్షుడు తుడుము సుబ్బారావు ఆధ్వర్యాన తూటంగి, లైగండ, గుంటసీమ, అరమ పంచాయతీల పరిధి గిరిజన గ్రామాల్లో ఇంటింటి కెళ్లి ప్రచారం చేశారు. అరకు పార్లమెంట్‌ కోశాధికారి నాగేశ్వరరావు, పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు సుబ్బారావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జి.మాడుగుల, న్యూస్‌టుడే: తెదేపా వస్తేనే గిరిజనుల అభివృద్ధి సాధ్యపడుతుందని ఎంపీపీ పద్మ తెలిపారు. జి.మాడుగుల మండలం బొయితిలి, కిల్లంకోట పంచాయతీల్లో తెదేపా నాయకులతో కలిసి పర్యటించారు. కూటమి అధికారంలోకి రావడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నాయకులు నాగబ్బాయి, రామకృష్ణ, జనసేన నాయకుడు సింహాచలం పాల్గొన్నారు.

చింతూరు, న్యూస్‌టుడే: చింతూరు మండలంలోని రామన్నపాలెం, పెద్దసీతనపల్లి పంచాయితీల్లో కూటమి అభ్యర్థులైన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిల గెలుపు కోసం కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను గూర్చి వివరించారు. మూడు పార్టీల మండల అధ్యక్షులు ఇల్లా చిన్నారెడ్డి, చిట్టిబాబు, మడివి రాజు, నాయకులు రవి, శీలం తమ్మయ్య, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

బొయితిలిలో ప్రచారాన్ని చేస్తున్న ఎంపీపీ పద్మ, కూటమి నాయకులు

సంతలో ఎన్నికల సందడి

ఐక్యంగా కదిలిన ఎన్డీఏ నేతలు

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతలో ఎన్నికల సందడితో నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావటంతో పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రచారాలు నిర్వహించారు. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత, అసెంబ్లీ అభ్యర్థి పాంగి రాజారావులను గెలిపించాలని కూటమి నాయకులు ప్రచారం చేశారు. మరో వైపు కాంగ్రెస్‌ అభ్యర్థి శెట్టి గంగాధర్‌స్వామిని గెలిపించాలని ఇండియా కూటమి నాయకులు, స్వాతంత్ర అభ్యర్థి సీవేరి అబ్రహాంలను గెలిపించాలని వారి అనుచరులు ప్రచారాలు నిర్వహించారు. పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించి, అనుమతులను పరిశీలించారు. గ్రామాల్లో ఇటుకల పండగ జరుగుతుండటంతో సంతలో జనసందోహాం తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని