logo

పింఛన్ల పంపిణీ ఆలస్యానికి కుట్ర

వచ్చే నెల ఒకటో తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి సియారి దొన్నుదొర డిమాండ్‌ చేశారు.

Published : 28 Apr 2024 02:00 IST

నినాదాలు చేస్తున్న దొన్నుదొర, రాజారావు, నాయకులు

అనంతగిరి/గ్రామీణం, న్యూస్‌టుడే: వచ్చే నెల ఒకటో తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి సియారి దొన్నుదొర డిమాండ్‌ చేశారు. శనివారం కూటమి పార్టీల నాయకులతో కలిసి మండలంలో పర్యటించారు. డముకులో వారు మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీ ఆలస్యం చేయాలని వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. గత నెల వృద్ధులు, దివ్యాంగులను గ్రామ సచివాలయాలకు రప్పించి వారిని ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో 32 మంది చనిపోయారన్నారు. వచ్చే నెల ఇంటి వద్దనే పింఛన్లు అందజేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తెదేపా నాయకులు శెట్టి బాబూరావు, భాజపా నాయకులు చిరంజీవి, మురళి తదితరులు పాల్గొన్నారు.

  • వర్గ విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో ముందుకు సాగితే విజయం సునాయాసం అవుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. డముకు వద్ద శనివారం తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొన్నుదొరతో కలిసి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెదేపా, భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. దొన్నుదొర మాట్లాడుతూ.. పాంగి రాజారావు విజయం కోసం ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. గెలుపే లక్ష్యంగా మారుమూల గ్రామాల్లోకి వెళ్లాలని చెప్పారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు