logo

కూటమి గెలిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్‌

రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని, ఓటర్లు ఆలోచించి మద్దతు తెలపాలని పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఆదివారం అన్నవరం, లోతుగెడ్డ పంచాయతీల్లోని దోమలగొంది,

Published : 29 Apr 2024 01:52 IST

తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలతో గిడ్డి ఈశ్వరి

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని, ఓటర్లు ఆలోచించి మద్దతు తెలపాలని పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఆదివారం అన్నవరం, లోతుగెడ్డ పంచాయతీల్లోని దోమలగొంది, గొడుగులమెట్ట, చౌడురాయి, కోటకొండ, గాలిపాడు, కొత్తూరుబయలు తదితర గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. ఐదేళ్ల వైకాపా పరిపాలనలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి జాడ కనిపించలేదని విమర్శించారు. సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి రూ.100 వసూలు చేశారని, ధరలు పెంచి దోచేశారని ఆరోపించారు. తెదేపా అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని, సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తామన్నారు. లోతుగెడ్డ సర్పంచి చింతర్ల సునీల్‌, ఎంపీటీసీ సభ్యుడు సుబ్బారావు ఆధ్వర్యంలో చౌడురాయిలో వైకాపాకు చెందిన 50 కుటుంబాలు తెదేపాలో చేరాయి. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. తెదేపా నేతలు రాజమండ్రి నారాయణరావు, పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, గంగరాజు, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని