బీరు సీసాతో భార్యపై భర్త దాడి
స్థానిక బీసీకాలనీలో సోమవారం భార్యపై భర్త బీరుసీసాతో దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.
చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మి
నందిగామ, న్యూస్‌టుడే: స్థానిక బీసీకాలనీలో సోమవారం భార్యపై భర్త బీరుసీసాతో దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. సీఐ కె.సతీష్ తెలిపిన వివరాలు ప్రకారం స్థానిక డీవీఆర్‌కాలనీకి చెందిన పల్లపు ఆంజనేయులు లారీ క్లీనరుగా పని చేస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం బీసీకాలనీకి చెందిన శ్రీలక్ష్మితో అతనికి వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో తరుచూ భర్త వేధిస్తుండటంతో నందిగామ పోలీసుస్టేషన్లో భార్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. గత ఏడు నెలలుగా శ్రీలక్ష్మి పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మరొకరితో ఫోన్లో మాట్లాడుతుందనే అనుమానంతో సోమవారం ఉదయాన్నే భర్త శ్రీలక్ష్మి ఇంటి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో ఆమె బాత్‌రూమ్‌లో స్నానం చేస్తోంది. భర్త మాట విన్న ఆమె భయంతో లోపలే ఉంది. అనంతరం వెళ్లిపోయాడని భావించి బయటకు రాగా బీరు సీసాతో దాడి చేసి ఎక్కడపడితే అక్కడ పొడిచాడు. అడ్డం వచ్చిన వారిపైనా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. తీవ్రగాయాలైన ఆమెను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం సీఐ సతీష్, ఎస్సై పండుదొర వెంటనే అంబులెన్స్ మాట్లాడి విజయవాడకు పంపించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం