logo

చెత్తకు నిప్పు.. గ్యాస్‌ పైప్‌లైన్‌కు మంటలు

ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్‌ పైప్‌లైన్‌ లుకింగ్‌ పాయింట్‌కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు.

Published : 19 Apr 2024 04:57 IST

సకాలంలో స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం

విన్నకోట(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్‌ పైప్‌లైన్‌ లుకింగ్‌ పాయింట్‌కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. వివరాల్లోకి వెళితే..గురువారం సాయంత్రం విన్నకోటకు శివారు జేమ్స్‌పేట మలుపు రోడ్డులోని చెట్ల కింద చెత్తకు ఎవరో నిప్పుపెట్టారు. ఆ మంటలు చుట్టుపక్కల వ్యాపించి రహదారి పక్కనే వేసిన మేగా కంపెనీ గ్యాస్‌ పైప్‌లైన్‌కు మధ్యలో ఏర్పాటు చేసే కంట్రోల్‌, లుకింగ్‌ పాయింట్లో అంటుకొని మంటలు వ్యాపించాయి. దీంతో ఆ దారిలో వెళ్తున్న వాహనాలు, ప్రయాణికులు దూరంగా నిలబడ్డారు. గుడివాడ అగ్నిమాపకవాహన సిబ్బంది వచ్చి మంటల్ని అదుపు చేశారు. ఈ లోగా గ్యాస్‌ కంపెనీ ప్రతినిధులు ఇరువైపులా మరో పాయింట్‌లో గ్యాస్‌ నిలుపుదల చేయడంతో అందరూ ఊరిపి పీల్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని