logo

అట్టహాసంగా తెదేపా అభ్యర్థి బోడే నామినేషన్‌

పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్‌ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు.

Published : 20 Apr 2024 05:30 IST

భారీ ప్రదర్శనగా తరలి వస్తున్న బోడే ప్రసాద్‌, వెంట ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, కొనకళ్ల, వంగవీటి రాధాకృష్ణ, వైవీబీలు

పెనమలూరు, న్యూస్‌టుడే: పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్‌ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు. ఉదయం 9.30 గంటలకు పోరంకిలోని పార్టీ కార్యాలయం నుంచి భారీ ప్రదర్శనగా బయల్దేరి పెనమలూరు తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం 11.45 గంటలకు  రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి డి.రాజుకు అందజేశారు. అనంతరం ప్రసాద్‌ భార్య హేమాచౌదరి మరో రెండు సెట్లు దాఖలు చేశారు. బోడే అభ్యర్థిత్వాన్ని యార్లగడ్డ రాజబాబు, కనకమేడల వెంకటరమణలు ప్రతిపాదించారు. హేమాచౌదరిని సుంకర వెంకటసురేష్‌, దేవినేని రత్నభూషణ్‌లు ప్రతిపాదించారు. బోడే ప్రసాద్‌ వెంట మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, వైవీబీ రాజేంద్రప్రసాద్‌లు ఉండగా.. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి కేంద్ర ఎన్నికల పరిశీలకులు రిషబ్‌గుప్తా, ప్రవీణ్‌ చౌహాన్‌లు పెనమలూరు తహసీల్దారు కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్‌ అధికారితో చర్చించారు. నామినేషన్‌కు ముందు మాజీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పోరంకి తెదేపా కార్యాలయానికి వెళ్లి బోడే ప్రసాద్‌కు అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని