logo

తెదేపా కార్యాలయం ప్రారంభం

ఘంటసాల మండలం దాలిపర్రులో తెదేపా కార్యాలయంను అవనిగడ్డ నియోజకవర్గం జనసేన, తెదేపా, భాజపా ఉమ్మడి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ శనివారం ప్రారంభించారు.

Updated : 20 Apr 2024 17:38 IST

ఘంటసాల: ఘంటసాల మండలం దాలిపర్రులో తెదేపా కార్యాలయంను అవనిగడ్డ నియోజకవర్గం జనసేన, తెదేపా, భాజపా ఉమ్మడి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. చంద్రబాబు పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్‌ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జనసేన, తెదేపా నాయకులు చిలకలపూడి పాపారావు, బాల కోటేశ్వరరావు, చౌదరి బాబు, సుభాష్ చంద్రబోస్, వెంకట రామకృష్ణ, మధు, భవానీ ప్రసాద్, రామకృష్ణ, భాను ప్రకాష్, ప్రసాద్, చలపతిరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని