logo

43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు

జిల్లాలోని పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు.

Published : 25 Apr 2024 05:21 IST

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లాలోని పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానానికి కూటమి అభ్యర్థిగా జనసేన తరఫున వల్లభనేని బాలశౌరి రెండు సెట్లు, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గొల్లు కృష్ణ, జైభీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ నుంచి పరిటాల వెంకట ఫణిబాబు, స్వతంత్రులుగా సైకం భాస్కరరావు, ధనేకులు గాంధీలు తమ నామపత్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీకి అందజేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీ గన్నవరంలో తెదేపా అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు, వైకాపా అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్‌, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి పొట్లూరి రవీంద్రకుమార్‌, తెలుగు రాజాధికార సమితి అభ్యర్థిగా తాడంకి జగదీష్‌రామచంద్రరావు, స్వతంత్రులుగా వల్లభనేని మోహనవంశీకృష్ణ, గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, ఎస్‌.విజయదుర్గ, పొట్లూరి శ్రీదేవి, కె.శివదుర్గావరప్రసాద్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.  గుడివాడకు జైభీమ్‌రావ్‌ సమతి పార్టీ నుంచి సింగవరపు జోసెఫ్‌, నవరంగ్‌ కాంగ్రెస్‌ నుంచి పంది నాగార్జున, స్వతంత్ర అభ్యర్థులుగా గుండాబత్తిన అంబేడ్కర్‌, ఏల్చూరి వేణుగోపాలరావు, మిగద రాములు నామపత్రాలు ఇచ్చారు. పెడనలో తెదేపా అభ్యర్థులుగా కాగిత కృష్ణప్రసాద్‌, కాగిత శిరీష, వైకాపా అభ్యర్థులుగా ఉప్పాల రమేష్‌(రాము) రెండు సెట్లు, ఉప్పాల హారిక మూడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. అవనిగడ్డలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నుంచి అందే శ్రీరామమూర్తి రెండు సెట్లు, అందే శ్రీవాణి, జైభీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ నుంచి సముద్రాల అంబేడ్కర్‌, వైకాపా అభ్యర్థులుగా సింహాద్రి రమేష్‌బాబు రెండు సెట్లు, సింహాద్రి వికాస్‌, స్వతంత్రునిగా మండలి వెంకట్రామ్‌లు నామపత్రాలు వేశారు. పామర్రులో తెదేపా నుంచి వర్ల కుమార్‌రాజా,  వైకాపా నుంచి కైలే జ్ఞానమణి, జైభీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ నుంచి కొడాలి సునీల, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులుగా దోవారి ఏసుదాస్‌, దోవారి అమర్‌నాధ్‌లు నామపత్రాలు సమర్పించారు. పెనమలూరులో వైకాపా అభ్యర్థులుగా జోగి రమేష్‌ నాలుగు సెట్లు,  జోగి రాజీవ్‌ రెండు సెట్లు, తెదేపా అభ్యర్థిగా బోడే ప్రసాద్‌, జైమహాభారత్‌ పార్టీ నుంచి మరదాని వైజయ్య, స్వతంత్రునిగా జొన్నలగడ్డ సతీష్‌, మచిలీపట్నంలో తెదేపా అభ్యర్థులుగా కొల్లు రవీంద్ర మూడు సెట్లు, కొల్లు నీలిమ మూడు సెట్లు, బహుజనసమాజ్‌ పార్టీ నుంచి సౌదాడ బాలాజీ, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా అబ్దుల్‌మతీన్‌లు నామినేషన్లు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు