logo

జగన్‌ అన్ని రంగాలను దోచేశారు : వర్ల

శాండ్‌, ల్యాండ్‌, మైన్‌, వైన్‌ ఇలా అన్ని రంగాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దోచేశారని తెదేపా కూటమి నియోజకవర్గ అభ్యర్థి వర్ల కుమార్‌రాజా అన్నారు.

Published : 28 Apr 2024 03:27 IST

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే: శాండ్‌, ల్యాండ్‌, మైన్‌, వైన్‌ ఇలా అన్ని రంగాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దోచేశారని తెదేపా కూటమి నియోజకవర్గ అభ్యర్థి వర్ల కుమార్‌రాజా అన్నారు. మండలంలోని గుర్విందపల్లి, చినపులిపాక, బొడ్డపాడు, రొయ్యూరు గ్రామాల్లో సూపర్‌-6 పథకాలను విస్తృతంగా ప్రచారం తెదేపా బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి వెంటక గురుమూర్తి, నాయకులు వీరపనేని శివరామప్రసాద్‌, గోపాలకృష్ణ, రేణుకారావు, జనసేన నాయకుడు తాడిశెట్టి నరేష్‌, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తెదేపాలో చేరిక

రొయ్యూరు(తోట్లవల్లూరు), న్యూస్‌టుడే: రొయ్యూరులో శనివారం పలువురు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. వారికి కూటమి అభ్యర్థి వర్ల కుమార్‌రాజా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపా మండల అధ్యక్షుడు వీరపనేని శివరామప్రసాద్‌, వీరంకి వెంకట గురుమూర్తి, రేణుకారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


పామర్రు, న్యూస్‌టుడే: తెదేపా కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కుమార్‌రాజా భార్య విశ్రమ అభ్యర్థించారు. శనివారం పామర్రు శివారు చాట్లవానిపురంలో మన ఇంటికి మన వర్ల కుటుంబం కార్యక్రమంలో భాగంగా ఆమె సూపర్‌-6 పథకాలను స్థానికులకు వివరించి, కరపత్రాలు పంపిణీ చేశారు.

స్థానిక వీరాంజనేయ కాలనీలో తెదేపా నాయకులు, కార్యకర్తలు శనివారం సాయంత్రం మన ఇంటికి న వర్ల కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. జనసేన మండల అధ్యక్షుడు గుంపా గంగాధర్‌, టౌన్‌ అధ్యక్షుడు పరసా సుబ్రహ్మణ్యం పాల్గొని తెదేపా అభ్యర్థి వర్ల  కుమార్‌రాజాను, జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.


కపిలేశ్వరపురం(పమిడిముక్కల),న్యూస్‌టుడే: ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గ అభ్యర్థి వర్ల కుమార్‌రాజాను గెలిపించాలని కోరుతూ శనివారం వర్ల సోదరుడు చాణుక్య, నాయకులు చిగురుపాటి జగదీష్‌, గోవిందు, ఫణిబాబులు ఇంటింటి ప్రచారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని