logo

కూడూరులో కాగితకు మద్దతు

వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్‌(రాము) సొంత పంచాయతీ కూడూరులో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు.

Published : 29 Apr 2024 05:12 IST

వైకాపా అభ్యర్థి సొంతూరిలో గ్రామస్థుల ఘన స్వాగతం

పెడన, పెడన గ్రామీ ణం, న్యూస్‌టుడే: వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్‌(రాము) సొంత పంచాయతీ కూడూరులో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఆ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కృష్ణప్రసాద్‌కు గ్రామస్థులు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ తన తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుకు పెడన నియోజకవర్గంతో విడదీయలేని బంధం ఉందన్నారు.  తెదేపా కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంద]న్నారు. జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆయన సోదరుడు జగన్నాథరావు, మండల తెదేపా అధ్యక్షుడు శలపాటి ప్రసాద్‌, స్థానిక నేతలు శొంఠి రామ్మోహనరావు(రాము) కాగిత వెంకటేశ్వరరావు, వేముల అర్జునరావు, కాగిత రవి, కాగిత శివ, కాగిత నాగబాబు, శొంఠి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

వైకాపా కుయుక్తులు: కూడూరుకు చెందిన మాజీ సర్పంచి భర్త కాగిత శ్రీహరి కృష్ణప్రసాద్‌ ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. తెదేపా కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌, కాగిత శ్రీహరి కృష్ణప్రసాద్‌ల పేర్లు ఒకే రీతిలో ఉండడంతో తెదేపా కూటమి ఓట్లు ఇండిపెండెంట్‌కు పడతాయన్న కుట్రతో రంగంలోకి దించారని తెదేపా శ్రేణులు ధ్వజమెత్తారు. ఇలాంటి కుయుక్తులకు బెదిరేది లేదని ప్రజలకు అంతా తెలుసని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ఉద్ఘాటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని