logo

ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు: 15 మందికి గాయాలు

నగరంలోని కనకదుర్గమ్మ వారధి వద్ద బుధవారం ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. గుంటూరు నుంచి విజయవాడ బయలుదేరిన ఆర్టీసీ బస్సు వారధి సమీపంలో ట్రాక్టర్‌ను ఢీకొంది.

Published : 27 Jan 2022 05:15 IST

ఘటనా స్థలిలో ట్రాక్టర్‌, ఆర్టీసీ బస్సు

తాడేపల్లి, న్యూస్‌టుడే: నగరంలోని కనకదుర్గమ్మ వారధి వద్ద బుధవారం ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. గుంటూరు నుంచి విజయవాడ బయలుదేరిన ఆర్టీసీ బస్సు వారధి సమీపంలో ట్రాక్టర్‌ను ఢీకొంది. బస్సులోని 15 మందికి గాయాలవగా, ఆర్టీసీ చోదకుడు జిలానీ (పొన్నూరు), మహిళా కండక్టర్‌ మీనాక్షి (వట్టిచెరుకూరు), ప్రయాణికురాలు వైష్ణవి (వెంకటరెడ్డిపాలెం)కి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు ప్రాథమిక చికిత్స అనంతరం తమ గమ్యాలకు వెళ్లిపోయారు. ట్రాక్టర్‌ చోదకుడు, ఇదే సమయంలో ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన ద్విచక్ర వాహన చోదకుడు మహానాడుకు చెందిన గురవయ్య గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో విజయవాడ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి వస్తుండడంతో పోలీసులంతా బందోబస్తులో నిమగ్నమయ్యారు. దీనివల్ల స్వల్పంగా గాయపడిన వారు రక్త గాయాలతో వెళ్లిపోవడం కనిపించింది. సీఎం ఆయన నివాసానికి చేరుకున్న తర్వాత బందోబస్తు నుంచి వచ్చిన పోలీసులు రహదారిపై ఉన్న బస్సు, ట్రాక్టర్లను పక్కకు తొలగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని