logo

కోడ్‌ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

Published : 19 Apr 2024 03:44 IST

మానిరేవు గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. గురువారం కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల లోగో, సీఎం జగన్‌, మంత్రితో పాటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల చిత్రాలు, పార్టీ గుర్తు కలిగి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా సిద్ధం ప్లెక్సీలను గ్రామంలోని వాల్మీకి విగ్రహం, రచ్చకట్ట, బీసీకాలనీ, ఎస్సీ కాలనీల్లో కట్టారు. వైకాపా నాయకులకు ఎన్నికల కోడ్‌ వర్తించదా అని చర్చించుకొన్నారు. దీనిపై ఎంసీసీ సాలమన్‌ వివరణ కోరగా ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎలాంటి అనుమతి లేదన్నారు. అలాంటివి ఏవైనా ఉంటే తొలగింపజేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని