logo

నామినేషన్ల పర్వం ప్రారంభం

మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది.

Published : 19 Apr 2024 03:49 IST

తొలి రోజు లోక్‌సభకు ఒకటి, శాసనసభకు ఆరు దాఖలు

నామపత్రం దాఖలు చేస్తున్న తెదేపా అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ అభ్యర్థి బీకే, పల్లె కృష్ణకిశోర్‌

పుట్టపర్తి, న్యూస్‌టుడే : మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. హిందూపురం పార్లమెంటు స్థానానికి రిటర్నింగ్‌ అధికారిగా కలెక్టర్‌ అరుణ్‌బాబు ఎన్నికల పబ్లిక్‌ నోటీసు విడుదల చేశారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఆర్వోలు పబ్లిక్‌ నోటీసు విడుదల చేయగా.. ఉదయం 11 గంటలకు మొదలైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. బీ హిందూపురం పార్లమెంటు స్థానానికి వైకాపా అభ్యర్థి శాంత తరఫున లక్ష్మీనారాయణరెడ్డి ఒక సెట్‌ నామపత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. పుట్టపర్తి అసెంబ్లీ స్థానానికి తెదేపా తరఫున పల్లె సింధూరరెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, పల్లె వెంకటకృష్ణకిశోర్‌రెడ్డి, ధర్మవరం అసెంబ్లీకి వైకాపా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రాప్తాడు అసెంబ్లీకి ఇండిపెండెంటుగా రాజేశ్‌కుమార్‌, హిందూపురం అసెంబ్లీకి బీఎస్‌పీ అభ్యర్థిగా శ్రీరాములు నామపత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా కలెక్టరేట్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్వో కేంద్రాల వద్ద పటిష్ఠమైన పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టారు.


అభ్యర్థుల ఆస్తిపాస్తులు

ఈనాడు, డిజిటల్‌, పుట్టపర్తి: నామినేషన్‌ మొదలైన తొలిరోజు పలు పార్టీల అభ్యర్థులు వారి ఆస్తిపాస్తులు, విద్యార్హత, కేసుల వివరాలను నామపత్రాల్లో దాఖలు పర్చారు. ఆ వివరాలు సంక్షిప్తంగా ఇలా..

అభ్యర్థి: పల్లె సింధూరరెడ్డి
పార్టీ: తెదేపా
నియోజకవర్గం: పుట్టపర్తి
విద్యార్హత: ఎంటెక్‌
కేసులు: ఒక కేసు(188 సెక్షన్‌)
చరాస్తులు: రూ.1.41 కోట్లు
బంగారం: 300 గ్రాములు
స్థిరాస్తులు: రూ.4.75 కోట్లు
అప్పులు: రూ.2.17 కోట్లు


అభ్యర్థి: జె.శాంత
పార్టీ: వైకాపా
నియోజకవర్గం: హిందూపురం (ఎంపీ)
విద్యార్హత: పీయూసీ
కేసులు: లేవు
చరాస్తులు: రూ.1.80 కోట్లు
బంగారం: 500 గ్రాములు
స్థిరాస్తులు: రూ.42 లక్షలు
అప్పులు: రూ.5.46 లక్షలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని