logo

మెట్టుకు ఓటేస్తే చెత్తబుట్టలో వేసినట్టే : కాలవ

మెట్టు గోవిందరెడ్డి తన పదవులను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించటం తప్పా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఆయనకు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్లేనని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.

Published : 28 Apr 2024 03:45 IST

మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు, నాయకులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: మెట్టు గోవిందరెడ్డి తన పదవులను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించటం తప్పా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఆయనకు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్లేనని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. శనివారం మధ్యాహ్నం బీటీపీ రోడ్డులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో మార్కెట్‌యార్డు మాజీ ఉపాధ్యక్షుడు, యాదవ సంఘం మాజీ అధ్యక్షుడు బంగి ఉమాశంకర్‌ అధ్యక్షతన నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమావేశంలో కాలవ మాట్లాడారు. మెట్టుకు ఓటు వేస్తే ఆయన, అతని వ్యాపారం బాగుంటుందని, కాలవకు ఓటు వేస్తే రాయదుర్గం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు బాగుంటారన్నారు. ఎన్నికల్లో అక్రమంగా గెలవటానికి మెట్టు దొంగ దారులు వెతుక్కుంటున్నాడన్నారు. తన ఓట్లు చీల్చటానికి శ్రీనివాసులు అనే పేరున ఉన్న కొందరితో నామినేషన్‌ వేయించాడని ఆరోపించారు. ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. యాదవులకు తెదేపా ప్రాధాన్యం ఇస్తుందని, వెంకటశివుడు యాదవ్‌ను తెదేపా జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు కాలవ తెలిపారు. తాను గెలిచాక యాదవుల కోసం కల్యాణ మండపం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైకాపాను బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో బీటీ వెంకటేశులు, వై.వెంకటేశులు, వేణు, బేకరి తిప్పేస్వామి, రఘు, ముత్తప్ప, న్యాయవాది లోకానంద, నరసింహులు, లోకేశ్‌, యాదవులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని