logo

పెళ్లి లారీ బోల్తా

వివాహ వేడుకలు ముగించుకుని సొంతూళ్లకు పయనమవుతున్న వారికి దారి మధ్యలో సంభవించిన అనుకోని ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలిగొంది.

Published : 29 Apr 2024 03:34 IST

బళ్లారి, న్యూస్‌టుడే: వివాహ వేడుకలు ముగించుకుని సొంతూళ్లకు పయనమవుతున్న వారికి దారి మధ్యలో సంభవించిన అనుకోని ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. పెళ్లి ముచ్చట్లు చెప్పుకొంటూ ఇంటికి చేరుకుంటున్నామనేలోపే ఈ ఘోరం జరిగిపోయింది. బళ్లారి తాలూకా కుడతిని ఫిర్కాలోని హెచ్చెల్సీ కాలువ వద్ద పెళ్లి లారీ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిని పట్టణసెరుగు గ్రామానికి చెందిన మారెమ్మ(45), భాగ్యమ్మ(35)గా గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు.. కురుగోడు తాలూకా పట్టణసెరుగు గ్రామానికి చెందిన బంధువులు కలిసి  డి.హిరేహళ్‌ మండలం కెరెనహళ్లి (చెర్లోపల్ల్లి) గ్రామంలో ఆదివారం జరిగిన వివాహానికి వెళ్లారు. మధ్యాహ్న భోజనం ముగించుకుని లారీలో సొంతూరికి వెళ్తున్న సమయంలో కుడతిని ఫిర్కాలోని కుడతిని - ఏళుబెంచి మధ్యలో హెచ్చెల్సీ కాలువ సమీపంలో వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి రహదారి పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మారెమ్మ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన భాగ్యమ్మను విమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మరో 26 మంది గాయపడగా, స్వల్పంగా గాయపడిన వారికి కుడతిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేసి ఇంటికి పంపారు. మిగిలిన వారిని బళ్లారి విమ్స్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని