logo

రథోత్సవానికి ఆహ్వానించలేదని వాగ్వాదం

వజ్రకరూరులో రథోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచి, ఆలయ పాలక మండలి సభ్యులను అధికారిక లాంచనాలతో ఆహ్వానించలేదని ఉపతహసీల్దార్‌ చంద్రశేఖర్‌, ఈవో కృష్ణయ్యతో స్థానిక వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు.

Published : 29 Apr 2024 03:36 IST

అధికారులతో వాదిస్తున్న వైకాపా నాయకులు

వజ్రకరూరు, న్యూస్‌టుడే: వజ్రకరూరులో రథోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచి, ఆలయ పాలక మండలి సభ్యులను అధికారిక లాంచనాలతో ఆహ్వానించలేదని ఉపతహసీల్దార్‌ చంద్రశేఖర్‌, ఈవో కృష్ణయ్యతో స్థానిక వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున తాము ఎవరిని పిలువలేదని, నిబంధనల మేరకే వ్యవహరించామని అధికారులు తెలిపారు. పనులు చేయించుకున్నప్పుడు రాని నిబంధనలు ఆహ్వానించడానికి అడ్డు వచ్చాయా అంటూ వారు గొడవకు దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారు లేకుండానే రథోత్సవం నిర్వహించాలని అధికారులు సిద్ధం అవుతుండగా గ్రామస్థులు కొందరు ఇరువురికి సర్తి చెప్పి కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించారు. వైకాపా నాయకుల తీరుపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని