logo

ఎమ్మెల్యే సోదరుడిని జిల్లా బహిష్కరణ చేయాలి

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి దౌర్జన్యకాండకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, అతడిని జిల్లా బహిష్కరణ చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్‌ చేశారు.

Published : 29 Apr 2024 03:39 IST

ఎస్పీకి చరవాణిలో ఫిర్యాదు చేసిన పరిటాల సునీత

రామగిరి మండలం కుంటిమద్ది పంచాయతీ సుద్దకుంటపల్లిలో ఎన్నికల ప్రచారంలో పరిటాల సునీత

రామగిరి, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి దౌర్జన్యకాండకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, అతడిని జిల్లా బహిష్కరణ చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె జిల్లా ఎస్పీకి చరవాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం వెంకటాపురంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.. రామగిరి మండలం మాదాపురం ఎంపీటీసీపై దాడికి తెగబడిన గంటల వ్యవధిలోనే మళ్లీ తోపుదుర్తిలో దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే స్వగ్రామం తోపుదుర్తిలో ఎస్సీలు, బోయలు తెదేపాలో చేరారన్న అక్కసుతో అర్ధరాత్రి వారి ఇళ్లపై దాడికి తెగబడ్డారని అన్నారు. అక్కడి తెదేపా నాయకుడు లింగమయ్యను బెదిరించి దాడికి పాల్పడగా బంధువులు ప్రతిఘటించారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకొని జిల్లా బహిష్కరణ చేయాలని కోరినట్లు తెలిపారు.

  • రాప్తాడు నియోజకవర్గంలో తెదేపా వర్గీయులపై దాడులు జరుగుతున్నా వలసలు ఆగడం లేదని సునీత, శ్రీరామ్‌లు పేర్కొన్నారు. రామగిరి, కనగానపల్లి మండలాలకు చెందిన 70 కుటుంబాలు ఆదివారం సునీత, శ్రీరామ్‌, సిద్ధార్థ సమక్షంలో తెదేపాలో చేరాయి. వీరందరికీ తెదేపా కండువా కప్పి వారు పార్టీలోకి ఆహ్వానించారు.  
  • ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించువాల్సిన అవసరం ఎంతైనా ఉందని సునీత అన్నారు. ఆదివారం రామగిరి మండలం వెంకటాపురంలో క్టస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌ఛార్జులతో సమావేశంలో నిర్వహించారు. మరో 15 రోజులు అందరూ కష్టపడి పనిచేయాలని సూచనలు చేశారు. తెదేపా హయాంలో డ్వాక్రా రుణాలకు రూ. 5 లక్షలకు సున్నా వడ్డీ ఇస్తే, జగన్‌ రూ.3 లక్షలకు ఇచ్చారని తిరిగి తెదేపా అధికారంలోకి వస్తే రూ.10 లక్షలకు సున్నావడ్డీ అమలు చేయునున్నట్లు తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని