logo

కర్ణాటకలో కళకళ.. జగన్‌ పాలనలో ఇలా..

ఒక పరిశ్రమ ఏర్పాటైతే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రగతి సాక్షాత్కారమవుతుంది. జగన్‌ పాలనలో అలాంటిదేం ఉండదు.

Published : 29 Apr 2024 03:44 IST

అక్కడ ప్రగతి బాట

గౌరిబిదనూరు పారిశ్రామికవాడలో కర్మాగారాలు

ఇక్కడ మూసివేత

తూముకుంటలో మూతపడిన ఫార్మా పరిశ్రమ

ఒక పరిశ్రమ ఏర్పాటైతే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రగతి సాక్షాత్కారమవుతుంది. జగన్‌ పాలనలో అలాంటిదేం ఉండదు. సిద్ధం సభల పేరుతో విచక్షణారహితంగా చెట్లను నరికేయడం, కొండలు తవ్వి ప్రకృతి విధ్వంసానికి పాల్పడటం లాంటివే కనిపిస్తాయి. కాసుల కోసం పరిశ్రమల యాజమాన్యాలను బెదిరించడం ఆనవాయితీగా మారుతోంది. తెదేపా హయాంలో పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిచిన రాష్ట్రం ఈ ఐదేళ్లలో తిరోగమన బాట పట్టింది. జగన్‌ సర్కారు కాలంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూసివేసే పరిస్థితి ఏర్పడింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం తూముకుంట పారిశ్రామికవాడను ఎన్టీఆర్‌ హయాంలో ప్రారంభించారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ పారిశ్రామికవాడలో 100కు పైగా చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు ఉన్నాయి. దీనికి దగ్గరలోనే ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు సమీపంలోనే కర్ణాటక ప్రభుత్వ హయాంలో గౌరిబిదనూరు పారిశ్రామికవాడను ఏర్పాటు చేశారు. ఈ రెండు పారిశ్రామికవాడ ప్రాంతాల మధ్య దూరం కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే. కానీ, మౌలిక సదుపాయాలు, నిర్వహణ తదితర విషయాల్లో చాలా దూరం ఉంది. అందుకు నిదర్శనమే ఈ చిత్రాలు.. గౌరిబిదనూరులో పరిశ్రమలు కళకళలాడుతుండగా తూముకుంటలో ఉన్న పారిశ్రామికవాడలో మౌలిక సదుపాయాల కల్పన లేదు. వైకాపా ప్రభుత్వ హయాంలో కరెంటు బిల్లులు, స్థానిక నేతల నుంచి డబ్బుల కోసం వేధింపులు భరించలేక 10 చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఫలితంగా 600 మంది పైగా ఉద్యోగాలు దూరమై వలస బాట పట్టాల్సిన అగత్యం ఏర్పడింది.

ఈనాడు, అనంతపురం

ఆకర్షణీయం

గౌరిబిదనూరు పారిశ్రామికవాడలో సెంట్రల్‌ లైటింగ్‌తో రహదారి

అధ్వానం

తూముకుంటలో  రోడ్డు దుస్థితి

పచ్చదనం

అక్కడ రహదారికి ఇరుపక్కలా పచ్చదనం

పిచ్చిమొక్కలు

ఇక్కడ రహదారుల పక్కన ఇదీ పరిస్థితి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని