logo

కొండను కొల్లగొట్టారు

పామిడి మండలంలోని వంకరాజుకాలువ, నెమళ్లపల్లి గ్రామ కొండల్లో నుంచి ఎర్రమట్టి తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. తాత్కాలిక అనుమతి పత్రాలు ఉన్నాయంటూ వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు. రోజూ ఇరవై టిప్పర్ల వరకు మట్టిని తరలిస్తున్నారు.

Published : 02 May 2024 03:46 IST

ఐదేళ్లలో రూ.2 కోట్ల అక్రమార్జన

హైటెన్షన్‌ విద్యుత్తు స్తంభాలకు ఆనుకొనే ప్రమాదకరంగా తవ్వకాలు

పామిడి, న్యూస్‌టుడే : పామిడి మండలంలోని వంకరాజుకాలువ, నెమళ్లపల్లి గ్రామ కొండల్లో నుంచి ఎర్రమట్టి తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. తాత్కాలిక అనుమతి పత్రాలు ఉన్నాయంటూ వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు. రోజూ ఇరవై టిప్పర్ల వరకు మట్టిని తరలిస్తున్నారు. కొండకు దగ్గర్లోనే హైటెన్షన్‌ తీగలు వెళ్తున్నా అక్రమార్కులు బరితెగించి తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్లు రాకపోకలు సాగించడానికి దాదాపు 2 కి.మీ.ల వరకు రహదారి వేశారు. పామిడి కేంద్రంగా స్థిరాస్తి వ్యాపారం పెరగడంతోనే ఎర్రమట్టికి డిమాండ్‌ పెరిగింది. వెంచర్లలో అంతర్గత రహదారుల నిర్మాణం, లోతట్టు ప్రాంతాలకు ఎర్రమట్టిని వినియోగిస్తున్నారు. స్థానిక వైకాపా ప్రజాప్రతినిధి భర్త అండదండలతోనే అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఐదేళ్ల కాలంలో రూ.కోట్లు విలువ చేసే ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. అధికార యంత్రాంగం చూసీˆ చూడనట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమార్కులు  కొండను కరిగించారిలా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని