logo

బ్రహ్మోత్సవంఏకాంతమేనా

శ్రీకాళహస్తి కరోనా రెండు దశల్లోనూ ముక్కంటి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో కేసులు గణనీయంగా పెరుగుతుండటం, వార్షికోత్సవాలకు నెల రోజులే గడువు ఉండటంతో ఈ ఏడాది వీటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల అనుమతి ఇస్తే బ్రహ్మోత్సవాలు నిర్వహించాలన్న తలంపుతో అధికారులున్నారు

Published : 24 Jan 2022 05:01 IST

పనుల ప్రారంభంపై సందిగ్ధం

న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి కరోనా రెండు దశల్లోనూ ముక్కంటి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో కేసులు గణనీయంగా పెరుగుతుండటం, వార్షికోత్సవాలకు నెల రోజులే గడువు ఉండటంతో ఈ ఏడాది వీటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల అనుమతి ఇస్తే బ్రహ్మోత్సవాలు నిర్వహించాలన్న తలంపుతో అధికారులున్నారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఫిబ్రవరి 24న భక్తకన్నప్ప ధ్వజారోహణంతో మహాశివరాత్రి వార్షిక ఉత్సవాలు ప్రారంభించాల్సి ఉంది. సాధారణంగా కనుమ పండుగ పూర్తయ్యాక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణ పనులు ప్రారంభించేవారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆలయాల్లో బహిరంగ ఉత్సవాలు నిర్వహించవద్దంటూ దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.

రూ.2.5 కోట్ల బడ్జెట్‌ : ఈ ఏడాది మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ రూ.2.5 కోట్ల బడ్జెట్‌ కేటాయించింది. మరింత ఎక్కువ నిధులు సమకూర్చుకునే అవకాశంతో ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఏకాంతంగా జరపాల్సి వస్తే చేయాల్సిన పనులకు సంబంధించి అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో నెల రోజులకు పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని అధికారగణం భావిస్తోంది. ఇంజినీరింగ్‌ శాఖ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు : బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లకు టెండర్ల నిర్వహణ పూర్తయింది. ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చి పనుల నిర్వహణకు ఆమోదం తెలిపితే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. - వెంకటనారాయణ, ఈఈ, శ్రీకాళహస్తీశ్వరాలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని