logo

‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’

నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి...

Published : 19 Apr 2024 03:04 IST

పుత్తూరు: వెంకటాపురంలో తండ్రి ముద్దుకృష్ణమనాయుడి సమాధి వద్ద నామినేషన్‌ పత్రాలు ఉంచి నమస్కరిస్తున్న భానుప్రకాష్‌

పుత్తూరు, నగరి: నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి సమాధి వద్ద నామపత్రాలు ఉంచి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నగరి కొత్తపేట వినాయకుడి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి ఆపై టవర్‌క్లాక్‌, మున్సిపల్‌ కార్యాలయం, ఓంశక్తి ఆలయం, తిరుపతి-చెన్నై హైవే మీదుగా జాతీయ రహదారి మీదుగా ప్రదర్శన చేపట్టారు. మండపం సమీపంలో తెలుగుయువత ఆధ్వర్యంలో క్రేన్‌ సాయంతో గజపూలమాల వేశారు. తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని.. తెదేపా రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు డీఎస్‌ గణేష్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌రాజు, నాయకుడు జీవీరెడ్డి, న్యాయవాది శేషాచలంతో వెళ్లి ఆర్వో వెంకటరెడ్డికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఆపై ఆయన మీడియాతో మాట్లాడుతూ నామినేషన్‌ సందర్భంగా వచ్చిన ప్రజాదరణ చూస్తే రాష్ట్రంలో వైకాపా పాలనపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. అవినీతి, అరాచక పాలనకు త్వరలోనే చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నగరిలో తెదేపా జెండా ఎగురవేస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

పుత్తూరు: నామినేషన్‌కు హాజరైన జనసందోహం

గంగాధరనెల్లూరు, పెనుమూరు: గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో.. వేపంజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్‌.గాంధీ తెదేపా తరఫున నామినేషన్‌ వేయగా.. స్వతంత్ర అభ్యర్థిగా కార్వేటినగరం మండలం సుద్దగుంట గ్రామానికి చెందిన పద్మనాభం తమ నామినేషన్లను ఆర్వో వెంకటశివకు అందజేశారు.

పెనుమూరు: నామినేషన్‌ దాఖలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గాంధీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని