logo

‘అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెప్పాలి’

ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెదేపా కూటమి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్‌ ప్రజలకు హామీ ఇచ్చారు.

Updated : 28 Apr 2024 04:36 IST

గుడిపాల: పేయనపల్లెలో ప్రజలతో మాట్లాడుతున్న జగన్మోహన్‌

యాదమరి: ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెదేపా కూటమి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. శనివారం దాసరాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులు వారికి ఘన స్వాగతం పలికారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సి.ఆర్‌.రాజన్‌, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, మండల పార్టీ అధ్యక్షుడు మురార్జీయాదవ్‌, ప్రధాన కార్యదర్శి రబీ, జిల్లా కార్యదర్శి హేమగిరి, బీసీసెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వినాయకం గౌండర్‌, జనసేన మండల అధ్యక్షుడు కుమార్‌ పాల్గొన్నారు.

తవణంపల్లె: తెదేపా అభ్యర్థి మురళీమోహన్‌.. సరకల్లులో ప్రచారం నిర్వహించారు.  రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరచౌదరి, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు జనార్దన్‌రావు, మండల అధ్యక్షుడు దిలీప్‌నాయుడు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జిలు సునీల్‌కుమార్‌, మోహన్‌నాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యులు కోదండయ్య పాల్గొన్నారు.

గుడిపాల: వైకాపా అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెప్పాలని తెదేపాఅభ్యర్థి గురజాల జగన్‌మోహన్‌ అన్నారు. పేయనపల్లె, శ్రీరంగపల్లె పంచాయతీల్లో ప్రచారం చేశారు. మండల పార్టీ కన్వీనర్‌ సుబ్రహ్మణ్యం నాయుడు, ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్‌, మాజీ జడ్పీటీసీ బాలాజీ, సర్పంచులు గుర్రప్పనాయుడు, అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

చిత్తూరు(జిల్లా పంచాయతీ): మాజీ మేయర్‌ కఠారి హేమలత, తెదేపా కూటమి అభ్యర్థి జగన్మోహన్‌ సతీమణి ప్రతిమ.. 33, 34, 4వ డివిజన్లు గంగనపల్లి, కన్నయ్యనాయుడుకాలనీ, బాలాజీకాలనీ, నజీర్‌కాలనీ, కట్టమంచిలో ప్రచారం నిర్వహించారు.

  • దొడ్డిపల్లిలో మాజీ ఎమ్మెల్యే సీకేబాబు తనయుడు సాయికృష్ణారెడ్డి మాజీ కార్పొరేటర్‌, కోఆప్షన్‌ సభ్యురాలు నళిని తిరుకుమరన్‌తో కలిసి ప్రచారం చేశారు. పుత్తూరు: పుత్తూరు అభివృద్ధి బాధ్యత తనదని తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ పేర్కొన్నారు. ముద్దుకృష్ణాపురం, ఆర్టీసీ కాలనీ, కళ్యాణపురం, పుత్తూరు దళితవాడ, ఎన్జీవో కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. భాజపా మహిళామోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషిధ, జనసేన ఇన్‌ఛార్జి మహేష్‌, పట్టణ తెదేపా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవరత్నం, ధనపాల్‌, మాజీ ఎంపీపీ ఏలుమలై, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి మాధవయ్య, తెదేపా జిల్లా బీసీసెల్‌ అధ్యక్షుడు షణ్ముగరెడ్డి, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ యుగంధర్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ ఆనంద్‌, కౌన్సిలర్‌ భువనేశ్వరి పాల్గొన్నారు. నగరి: తెదేపా నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. పట్టణ అధ్యక్షుడు జి.రమేష్‌బాబు, టీఎన్‌టీయూసీ జిల్లా అధికార ప్రతినిధి జ్యోతినాయుడు, జిల్లా కార్యదర్శి ఆర్‌.బాలాజీ,

ు పాల్గొన్నారు. వడమాలపేట: చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి ధనంజేయులునాయుడు.. బాలినాయుడు కండ్రిగలో బాబు స్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. జానా వెంకటయ్య, మణిరాజు, హేమావతి, లక్ష్మీప్రసన్న, ఆదెయ్య, షణ్మగం, ఉమాపతి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. పుత్తూరు: రాష్ట్రంలో 160 సీట్లతో తెదేపా అధికారంలోకి రావడం తధ్యమని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయబాబు పేర్కొన్నారు. చిన్నరాజుకుప్పంలో ఆయన్ను సత్కరించారు. శ్రీరంగరాజపురం: తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితేనే పేదల భవిష్యత్తు బాగుంటుందని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ థామస్‌ అన్నారు. మండల అధ్యక్షుడు జయశంకర్‌నాయుడు ఆధ్వర్యంలో నెళవాయి, ఎన్‌.ఆర్‌.పురం, ఏఎంపురం పంచాయతీల్లో తన పెద్దకుమారుడు రాహుల్‌, నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టిబాబు, నాయకులు రుద్రప్పనాయుడు, భాస్కర్‌నాయుడు పాల్గొన్నారు. జీడీనెల్లూరు,

పెనుమూరు: సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చిన థామస్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన భార్య శాంతిరెడ్డి ప్రజలను కోరారు. ఆమె మండలపార్టీ అధ్యక్షులు స్వామిదాస్‌ ఆధ్వర్యంలో బంగారెడ్డిపల్లె, చిన్నవేపంజేరి, పెనుమూరు మండలంలోని పులికల్లు పంచాయతీ గొడుగుమానుపల్లెలో ప్రచారం నిర్వహించారు.

వెదురుకుప్పం: థామస్‌ సోదరుడు నిధి.. పచ్చికాపల్లంలో మండల పార్టీ అధ్యక్షుడు లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని