logo

భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు

వాలంటీర్లను ప్రజాప్రతినిధులు.. ఓ చోట నిర్బంధించి భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు చేయించారని తెదేపా నాయకులు ఆరోపించారు.

Published : 28 Apr 2024 02:58 IST

ఎస్‌ఐ సహదేవికి ఫిర్యాదు చేస్తున్న తెదేపా నాయకులు

పలమనేరు: వాలంటీర్లను ప్రజాప్రతినిధులు.. ఓ చోట నిర్బంధించి భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు చేయించారని తెదేపా నాయకులు ఆరోపించారు. ఈ మేరకు వారు శనివారం పట్టణ ఎస్‌ఐ సహదేవికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్‌ పరిధిలోని వాలంటీర్లను మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ హేమంత్‌కుమార్‌రెడ్డి, ఛైర్‌పర్సన్‌ చాముండేశ్వరి భర్త సుధాకర్‌, వైకాపా నాయకుడు జాఫర్‌ నిర్బంధించారని వివరించారు. అడ్డుకోడానికి వెళ్లగా తమపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. తెదేపా నాయకుడు గిరిబాబు మాట్లాడుతూ వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తర్వాత ఆర్డీవో కార్యాలయ ఏవో కుప్పస్వామికి ఫిర్యాదు అందించారు. శ్రీధర్‌, నాగరాజు, బలరామ్‌కుట్టి, బిఆర్సీకుమార్‌, ఖాజాపీర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని