logo

జన, ధన, మాన చోరుడు జగన్‌..

‘ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రగతిని గోతిలో పాతిపెట్టాడు. రూ.లక్షల కోట్లు హాంఫట్‌ చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు.

Updated : 30 Apr 2024 06:24 IST

చంద్రబాబు వస్తేనే స్వర్ణ యుగం
చిత్తూరులో నందమూరి బాలకృష్ణ

బంగారుపాళ్యంలో బాలకృష్ణకు గజమాల

చిత్తూరు(సంతపేట), బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: ‘ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రగతిని గోతిలో పాతిపెట్టాడు. రూ.లక్షల కోట్లు హాంఫట్‌ చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు. స్వర్ణయుగం రావాలంటే చంద్రబాబు సీఎం కావాలి.. జగన్‌ మళ్లీ గెలిస్తే చీకటియుగం వస్తుంది.. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజలు రాష్ట్రాన్ని వదలి వెళ్లే పరిస్థితి వస్తుంది. జన, ధన, మాన చోరకుడు జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే పాశుపతాస్త్రం తెదేపా, జనసేన, భాజపా కూటమి.. ఈ ఎన్నికల్లో ఓటర్లు బాణాలై వైకాపా పాలనకు చరమగీతం పాడాలి’ అని హిందూపరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. బాలకృష్ణ సోమవారం రాత్రి చేపట్టిన స్వర్ణాంధ్ర సాకార యాత్రకు చిత్తూరు, బంగారుపాళ్యంలో అపూర్వ స్పందన దక్కింది. చిత్తూరు బైపాస్‌ రోడ్డు నుంచి సంతపేట మీదుగా గాంధీ విగ్రహ కూడలి వరకు పసుపు దళం బాలకృష్ణకు జేజేలు పలికాయి. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి బాలకృష్ణ మాట్లాడారు.
ఎర్రచందనం స్మగ్లర్‌కు చిత్తూరు వైకాపా టికెట్‌.. ‘వైకాపా దోపిడీదారుల్నే ప్రోత్సహిస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్‌ విజయానందరెడ్డికి చిత్తూరు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడం ఇందుకు నిదర్శనం. చిత్తూరులోని సహకార డెయిరీని కమీషన్లకు కక్కుర్తి పడి అమూల్‌కు ఇచ్చేసింది. చక్కెర కర్మాగారాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు లీజుకిచ్చే ప్రయత్నం చేస్తోంది. చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న యువకుడు గురజాల జగన్‌మోహన్‌, ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావును గెలిపించేందుకు సైకిల్‌ గుర్తుపై ఓటు వేయాలి. జిల్లాలో మామిడి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. తెదేపా హయాంలో మామిడి రైతుకు టన్నుకు రూ.5వేల నగదు అందచేసింది. మంత్రి పెద్దిరెడ్డి గ్రానైట్‌, అక్రమ ఇసుక వ్యాపారాలు సాగించి రూ.కోట్లు దోచుకున్నార’ని బాలకృష్ణ ఆరోపించారు.

చిత్తూరు నగరంలో మహిళల విజయకేతనం

విధ్వంసమే వైకాపా లక్ష్యం.. ‘రాయలసీమలో తెలుగు గంగ, హంద్రీ-నీవా ప్రాజెక్టులు, కియా పరిశ్రమల, శ్రీసిటీలో ప్రఖ్యాత కంపెనీల్ని తెదేపా తీసుకొస్తే వైకాపా భూకబ్జా, కల్తీ లిక్కర్‌ వ్యాపారం, గంజాయి, డ్రగ్స్‌ వ్యాపారంతో సీమను విధ్వంసం చేసింది.  ఐదేళ్లలో ప్రజలకు కష్టాల్ని చూపిన జగన్‌ను తరిమికొట్టేందుకు ఓటర్లంతా సంసిద్ధం కావాలని’ బాలకృష్ణ పిలుపునిచ్చారు. తెదేపా చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌, మాజీ ఎమ్మెల్యే మనోహర్‌, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ మేయర్‌ హేమలత, పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ మోహన్‌, మండల అధ్యక్షులు జయప్రకాష్‌నాయుడు బాలక్రిష్ణకు క్రేన్‌ సాయంతో భారీ గజమాలతో స్వాగతం పలికారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోకా ప్రకాష్‌ నాయుడు, చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యదర్శి ప్రకాష్‌నాయుడు, మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు జయచంద్రనాయుడు ఎన్నికలపై రచించిన సంసిద్ధం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని