logo

రోశయ్య సేవలు చిరస్మరణీయం

రోశయ్య సేవలు మరువలేనివని ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలోని కళావెంకట్రావు సెంటర్, వైకాపా కార్యాలయంలో రోశయ్య చిత్రపటానికి శనివారం నివాళి అర్పించారు. ఆర్యవైశ్య కల్యాణమండపంలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

Published : 05 Dec 2021 06:26 IST


కొత్తపేటలో నివాళులర్పిస్తున్న నాయకులు

న్యూస్‌టుడే బృందం: రోశయ్య సేవలు మరువలేనివని ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలోని కళావెంకట్రావు సెంటర్, వైకాపా కార్యాలయంలో రోశయ్య చిత్రపటానికి శనివారం నివాళి అర్పించారు. ఆర్యవైశ్య కల్యాణమండపంలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. కొత్తపేట, ఆత్రేయపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో కాంగ్రెస్, వైకాపా నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు సంతాపం తెలిపారు.
* రాజోలులో కాంగ్రెస్‌ నాయకులు, మలికిపురంలో ఆర్యవైశ్య సంఘం, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నాయకులు నివాళులు అర్పించారు. లక్కవరంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రుద్రరాజు గోపాలకృష్ణరాజు నేతృత్వంలో నివాళులర్పించారు. 
* సీఎంగా, ఆర్థికశాఖా మంత్రిగా, గవర్నర్‌గా రోశయ్య మృతి తెలుగు ప్రజలకు తీరనిలోటని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు, జనసేన పార్టీ నాయకుడు బండారు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ననబోలు సత్యనారాయణ తదితరులు సంతాపం తెలిపారు.
* పి.గన్నవరం, ముంగండలో ఆర్య వైశ్య సంఘాలు నివాళులర్పించాయి. అంబాజీపేటలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నెల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఏపీసీసీ కార్యదర్శి మహ్మద్‌ ఆరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు. మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు , మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి సంతాపం తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని