logo

మహిళా శక్తిని చాటేలా సాధికారత ఉత్సవం

మహిళా శక్తిని చాటిచెప్పేలా ‘దసరా మహిళా సాధికార ఉత్సవం’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Published : 01 Oct 2022 05:20 IST


వివరాలు వెల్లడిస్తున్న రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పద్మ

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): మహిళా శక్తిని చాటిచెప్పేలా ‘దసరా మహిళా సాధికార ఉత్సవం’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. రాజమహేంద్రవరం వేదికగా శనివారం జరిగే ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటారన్నారు. ఆనం కళాకేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  ఉత్సవంలో రాష్ట్ర మంత్రులు ఆర్‌.కె.రోజా, తానేటి వనిత, ఉషశ్రీచరణ్‌, రజని, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వేణుతోపాటు పలువురు ఎంపీలు, మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. కార్యక్రమ వివరాలు ఇలా వెల్లడించారు. * మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల నుంచి సుబ్రహ్మణ్య మైదానం వరకు మహిళలతో బైక్‌ ర్యాలీ, గుర్రపు స్వారీ. ‘దిశ’ చట్టంపై ప్రచారం చేస్తూ ఈ ర్యాలీ సాగుతుంది. * సాయంత్రం 4 గంటలకు సుబ్రహ్మణ్య మైదానంలో మహిళలకు కరాటే, కర్ర సాము, కబడ్డీ, కోలాటం తదితర పోటీలు. * సాయంత్రం 5 గంటలకు ‘సబల’ లఘు చిత్రాల ప్రదర్శన. పోటీల్లో ఎంపికైన వాటికి రూ.5 లక్షల బహుమతులు అందజేస్తారు. ఉత్తమ నటీనటులుగా ఎంపికైన వారికి కూడా రూ.20 వేల చొప్పున బహుమతులు అందిస్తారు. * సాయంత్రం 6 గంటలకు సభా కార్యక్రమం. అనంతరం వివిధ కళారూపాలు, నృత్యప్రదర్శనలు. * రాత్రి 8 గంటలకు  వివిధ పోటీల్లో
విజేతలైన మహిళలకు బహుమతుల ప్రదానం, స్ఫూర్తిదాయక మహిళలకు సన్మానం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని