logo

మహిళలతో తెదేపా మాటామంతీ

రాక్షస పాలన అంతంకావాలంటే మహిళలు చైతన్య వంతులు కావాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

Updated : 26 Nov 2022 04:48 IST

గోడప్రతిక విడుదల చేస్తున్న రామకృష్ణారెడ్డి, మజ్జి పద్మ, మాలె విజయలక్ష్మి తదితరులు

బిక్కవోలు, న్యూస్‌టుడే: రాక్షస పాలన అంతంకావాలంటే మహిళలు చైతన్య వంతులు కావాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి రూ.10 వేలు ఇచ్చి రూ.లక్షలు దోచుకుంటున్నారని విమర్శించారు. శుక్రవారం బిక్కవోలులో మహిళలతో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆదేశాలతో మొదటిసారిగా జిల్లాలోని అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో పైలెట్‌ కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మిగిలిన నాలుగు మండలాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని ఎందుకు చేపట్టాలో మహిళలే వివరిస్తారని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు లేవని, పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని విమర్శించారు. గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కనీసం పదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప అభివృద్ది జరగదన్నారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మాలె విజయలక్ష్మి మాట్లాడుతూ తెదేపా మహిళలకు మొదటి నుంచి ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు.  తెలుగు మహిళల ప్రతినిధులు బేరా వేణమ్మ, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని