logo

మంత్రి గారూ.. శిలాఫలకం చూశారేంటి!

అదిగో పారిశ్రామికవాడ వచ్చేస్తోంది.. ఇదిగో ఉపాధి దొరికేస్తుందంటూ ఎన్నికల కోడ్‌కు కొద్దిరోజుల ముందు హడావుడిగా శంకుస్థాపన చేసిన వైకాపా నేతలు, అంతే త్వరగా ఆ శిలాఫలకాన్ని మాయం చేసేశారు.

Published : 15 Apr 2024 03:09 IST

పారిశ్రామికవాడ శంకుస్థాపన తర్వాత మాయం
ఊకదంపుడు మాటలు.. కానరాని పనులు

శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి అమరనాథ్‌, ఎమ్మెల్యే రాజా, నాయకులు (పాతచిత్రం)

అదిగో పారిశ్రామికవాడ వచ్చేస్తోంది.. ఇదిగో ఉపాధి దొరికేస్తుందంటూ ఎన్నికల కోడ్‌కు కొద్దిరోజుల ముందు హడావుడిగా శంకుస్థాపన చేసిన వైకాపా నేతలు, అంతే త్వరగా ఆ శిలాఫలకాన్ని మాయం చేసేశారు. తమది మాయమాటల ప్రభుత్వమని చెప్పకనే చెప్పేశారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు.

ప్రస్తుతం పారిశ్రమికవాడ పార్కు ప్రదేశంలో కనిపించని శిలాఫలకం

రాజానగరం మండలం కలవచర్లలో వంద ఎకరాలలో పారిశామ్రికవాడ ఏర్పాటుచేస్తామని.. 369 యూనిట్లు నెలకొల్పడం ద్వారా ఐదువేల మందికి ఉపాధి దొరుకుతుందని గత నెల 12న మంత్రి గురువాడ అమరనాథ్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ.60.65 కోట్లు వెచ్చిస్తున్నట్లు సెలవిచ్చారు. ఇన్నాళ్లూ లేంది ఎన్నికల ముందు ఈ హడావుడి ఏమిటో అన్న అనుమానాలు అప్పుడే స్థానికుల్లో వ్యక్తమయ్యాయి. దానిని నిజం చేస్తూ కొద్దిరోజులకే అక్కడ శిలాఫలకం అదృశ్యమైంది. సరిగ్గా ఇప్పటికి నెలరోజులైనా తట్ట్టెడు మట్టి కూడా అక్కడ పోయలేదు. కనీసం ఓ గుంత తవ్వలేదు. నిరుద్యోగుల ఓట్ల కోసం నాడు ఈ తంతు నడిపించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని